మెదక్ కలెక్టరేట్: పదో తరగతి విద్యార్థులు తమలోని భయాన్ని వీడి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేపటి నుంచి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు, విధులు నిర్వర్తించే అధికారులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థుల కోసం కలెక్టరేట్‌లోని విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం (9848214166) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల కోసం జిల్లాలోని 68 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి మొత్తం 11,347 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షకు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుందన్నారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని, సందేహాలుంటే పరిష్కరించుకోవాలన్నారు.
విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూం
హాల్‌టికెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం
విద్యార్థులు భయం వీడాలని కలెక్టర్ సూచన


