పాపన్నపేట(మెదక్): మండలంలోని కొ డుపాక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అప్షా కలాం వరల్డ్ రికార్డ్స్– 2026 అవార్డు అందుకుంది. ఆవర్తన పట్టికలోని 118 మూలకాలను బ్లాక్ వైజ్, గ్రూప్ వైజ్‌లతో కేవలం 32 సెకన్లలో చెప్పడంతో ఈ రికార్డు సాధించింది. ఆదివారం చైన్నెలోని శివానంద మెమోరియల్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటరమణ మార్గదర్శకత్వం వహించారు. ఈసందర్భంగా విద్యార్థినిని డీఈఓ విజయ, డీఎస్‌ఓ రాజిరెడ్డి, ఎంఈఓ ప్రతాప రెడ్డి, ఉపాధ్యాయులు ప్రశంసించారు.
కేసీఆర్ హయాంలోనే
గ్రామాలకు మహర్దశ
చిన్నకోడూరు(సిద్దిపేట): మహాత్ముని స్ఫూర్తితో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చౌడారంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గాంధీ గారి బాటలోనే కేసీఆర్, తెలంగాణ సమాజం స్వరాష్ట్రం కోసం శాంతియుత పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామన్నారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్ఫూర్తితో పల్లెల అభివృద్ధికి కేసీఆర్ పాటుపడ్డారన్నారు. 60 ఏళ్లలో చేయని అభివృద్ధి కేసీఆర్ చేసి గ్రామాల స్వరూపాలను మార్చారన్నారు. కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వాసుదేవాచారి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమం
పట్టని కాంగ్రెస్


