● రెండు నెలలుగా ఎదురుచూపులు
● నిత్యం 9 వేల మందికి పైగా ‘ఉపాధి’
● రూ.12 కోట్ల పైచిలుకు బకాయిలు
మెదక్‌జోన్: వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన గ్రామీణ రోజ్ గార్ గ్యారంటీ యోజన (బీఆర్‌జీవై) పథకం రోజు రోజుకు నీరుగారి పోతుంది. కూలీలకు వారానికోసారి రావాల్సిన డబ్బులు నెలల తరబడి అందడం లేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో కూలీ డబ్బులు రాకపోవటంతో కుటుంబాలకు గడవటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1.63 లక్షల జాబ్‌కార్డులు
జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, 3.23 లక్షల మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 9 వేల పైచిలుకు మంది పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా మట్టి రోడ్ల నిర్మాణాలు, కుంటల్లో పూడికతీత, ఇంకుడు గుంతల నిర్మాణం, నర్సరీల్లో మొక్కల పెంపకం, అడవుల్లో కందకాలు, ఫీడర్ ఛానళ్లు.. తదితర పనులు చేస్తున్నారు. కాగా నిబంధనల ప్రకారం బీఆర్‌జీవై పథకంలో పనులు చేసే కూలీలకు వారం రోజులకోసారి కూలీ డబ్బులు చెల్లించాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి 10 నుంచి డబ్బులు రావటం లేదు. ఈ లెక్కన సుమారు రెండు నెలలకు సంబంధించి రూ.12 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా అంగన్‌వాడీ, మహిళా భవనాలు, గొర్రెలు, గేదెలు, మేకల షెడ్లు తదితర నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ పనులు, ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులతో పాటు ఇతర లబ్ధిదారులు చేసిన పనులకు ఏడాదిగా నిధులు విడుదల కావడం లేదని తెలిసింది.
పథకంలో మార్పులు
ఫీల్డ్ అసిస్టెంట్లకు సైతం
రెండు నెలలుగా వేతనాలు రావటం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కుటుంబాలు గడవటం లేదని, ప్రభుత్వం వెంటనే ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.


