లక్ష్యసాధనలో ముందుండాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యసాధనలో ముందుండాలి

Mar 9 2026 9:26 AM | Updated on Mar 9 2026 9:26 AM

మెదక్‌జోన్‌: లక్ష్యసాధనలో మహిళలు ఎప్పుడూ ముందుండాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కానుగ రా ధిక అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని ఔట్‌డోర్‌ స్టేడియంలో లక్ష్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నిరంగాల్లో మహిళలు రాణించాలని, ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు వినియోగించుకోవాలన్నారు. అనంతరం వైస్‌ చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. స్టేడియం అభివృద్ధికి తన వంతుగా సహకారం అందిస్తానని క్రీడాకారులకు హామీ ఇచ్చారు. క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది భూపతిరాజు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి నాగరాజు, పీడీలు మాధవరెడ్డి, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement