లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవ సంరంభ ం షురూ అయింది. పోటెత్తిన భక్తులతో హరిద్రాతీరం పరవశించింది. భక్తజన నృసింహ నామస్మరణతో నాచగిరి మార్మోగింది. ఆదివారం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, స్వాతి నక్షత్రవేళ ‘గిరి ప్రదక్షిణ’ ఊరేగింపుతో క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పీఠాధిపతులు మాధవానంద సరస్వతి, మధుసూదనానంద సరస్వతి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్‌గుప్తా, ఈఓ రంగాచారి, ఆలయ ధర్మకర్తలు, ఇతర ప్రముఖులు బ్రహ్మోత్సవాల అంకురార్పణ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సాయంత్రం ఆలయ అర్చక, వేదపండితులు పాంచరాత్ర ఆగమ పద్ధతిలో శ్రీవారి బ్రహ్మోత్సవ పూజలకు శ్రీకారం చుట్టారు. – వర్గల్ (గజ్వేల్ )
బ్రహ్మోత్సవం.. ఆధ్యాత్మిక సంరంభం


