కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. వేకువజామునుంచే భక్తులు స్వామివారి పుష్కరిణిలో స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకపూజలు, పట్నాలువేసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ చైర్మన్ నర్సింహారెడ్డి, ఈఓ కృష్ణప్రసాద్, ఏఈఓ సుదర్శన్, శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు పర్యవేక్షించారు.


