ప్రాక్టికల్ ్సతో పట్టు సాధించాలి
నర్సాపూర్: సాంకేతిక చదువుకు పరిశోధనాత్మక అనుభవం అవసరమేనని హైదరాబాద్ ఐఐటీ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ అశోక్‌కుమార్‌పాండె అన్నా రు. బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న మెకానికల్ బాహాసే ఇండియా పోటీల సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ‘క్లాస్‌రూం వెలుపల విద్య అనుభవాధారిత అభ్యాస విధానం’ అంశంపై జరిగిన చర్చలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. క్లాస్ రూంలో పాఠ్యాంశాలు చదవడంతో పాటు వాటికి అనుబంధంగా ప్రాక్టికల్స్‌తో పట్టు సాధించాలని సూచించారు. చర్చలో తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ వి.ఆర్ గనేషన్, కాట్మండ్ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ గోకర్ణ ఫౌడెల్, అటోమోటివ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కౌన్సి ల్ ప్రతినిధి గరిమా ఝూంబ్, నామ్‌టెక్ డైరెక్టర్ కేసీ వోరా, సే ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్‌నాయర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆదివారం ఫైనల్ పోటీలు జరుగుతాయని బాహీసే ఇండియా కన్వీనర్ అలీసయ్యద్, కో కన్వీనర్ మురళీకృష్ణ చెప్పారు. కార్యక్రమాల్లో కాలేజీ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె, మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


