ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: టీఎన్జీఓ
మెదక్‌జోన్: నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అన్నారు. శుక్రవారం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జలగం ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అధికారుల వేధింపులు పదోన్నతులలో అక్రమాలు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సంఘం భవనం, ఇళ్ల స్థలాల కోసం తమ వంతుగా కృషి చేస్తామన్నారు. సమావేశంలో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి రిజ్వాన్ అలీ, సహాధ్యక్షులు పోచ య్య, కార్యవర్గ సభ్యులు ప్రసన్న, స్వప్న, ఝాన్సీ, ప్రతాప్ పాల్గొన్నారు.


