ఆఖరి మజిలీకి అవస్థలే.. | - | Sakshi
Sakshi News home page

ఆఖరి మజిలీకి అవస్థలే..

Mar 5 2026 8:25 AM | Updated on Mar 5 2026 8:25 AM

నర్సాపూర్‌ వైకుంఠధామంలో

సమస్యల తిష్ఠ

నర్సాపూర్‌: మున్సిపాలిటీలోని శ్మశానవాటికలో సమస్యలు తిష్ఠవేశాయి. అధికారులు కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. గతే డాది సెప్టెంబర్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ పట్టణంలో పర్యటించారు. ఈసందర్భంగా రూ. కోటి వెచ్చించి నిర్మించిన శ్మశానవాటికను ప్రారంభించారు. అయితే నీటి వసతి కల్పించకపోవడంతో అది ప్రారంభించినప్పటి నుంచి అలంకారప్రాయంగానే మిగిలింది. ఆరు నెలలు కావొస్తున్నా, అధికారులు వినియోగంలోకి తేలేకపోయారు. మోటార్‌, వైరును దొంగలు ఎత్తుకుపోవడంతో నీటి కటకట ఏర్పడింది. కొత్త బర్నింగ్‌ యూనిట్‌ నిర్మించినా, పాత బర్నింగ్‌ యూనిట్‌పైనే మృతదేహాలను దహనం చేస్తు న్నారు. మృతుడి కుటుంబీకులు మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇస్తేనే నీటి ట్యాంకర్‌ను వైకుంఠధామం వద్దకు పంపుతున్నారు. దహన సంస్కారాలు పూర్తవగానే ఆరు బయట స్నానాలు చేసి ఇళ్లకు వెలుతున్నారు. మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయమై మున్సిపల్‌ ఏఈ కృష్ణయ్యను వివరణ కోరగా.. వైకుంఠధామంలో బోరు వేసి కరెంట్‌ మోటార్‌ బిగించామని, రెండు సార్లు మో టార్‌ను దొంగలు ఎత్తుకుపోయారని తెలిపారు. బోరుకు మరమ్మతులు చేసి, నీటి సదు పా యం కల్పించి శ్మశానవాటికను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

నీటి వసతి లేక నిరుపయోగం

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement