జాతీయస్థాయిలో కానిస్టేబుల్‌ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయిలో కానిస్టేబుల్‌ ప్రతిభ

Mar 5 2026 8:25 AM | Updated on Mar 5 2026 8:25 AM

మెదక్‌కలెక్టరేట్‌: కానిస్టేబుల్‌ సాయికుమార్‌ విధుల్లో రాణించడంతో పాటు క్రికెట్‌లో జాతీయస్థాయికి ఎదగడం అభినందనీయమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయనను సన్మానించి నగదు ప్రోత్సా హకం అందజేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల తిరుపతిలో జరిగిన సౌత్‌జోన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో సాయికుమార్‌ అద్భుత ప్రదర్శనతో జట్టును సెమీ ఫైనల్‌ వరకు చేర్చడంలో కీలకపాత్ర పోషించినట్లు చెప్పారు. అలాగే ఎలైట్‌ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తెలంగాణ పోలీస్‌ జట్టును విజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించాడని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శైలేందర్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌రెడ్డి, సీసీ రాజేందర్‌ సిబ్బంది త దితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement