మూడు తహసీల్దార్‌ కార్యాలయాలకు భవనాలు | - | Sakshi
Sakshi News home page

మూడు తహసీల్దార్‌ కార్యాలయాలకు భవనాలు

Mar 5 2026 8:25 AM | Updated on Mar 5 2026 8:25 AM

మూడు తహసీల్దార్‌ కార్యాలయాలకు భవనాలు రామాయంపేట మున్సిపల్‌ కమిషనర్‌గా శ్రావణ్‌ ఈ వెటర్నరీ డాక్టర్‌ మాకొద్దు జనగణన శిక్షణకు జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి

మెదక్‌ అర్బన్‌: జిల్లాలో నూతనంగా ఏర్పాటైన మూడు మండలాల్లో, తహసీల్దార్‌ కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలంగాణ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని హవేళిఘణాపూర్‌, చిలప్‌చెడ్‌, నిజాంపేట మండల కేంద్రాల్లో తహసీల్దార్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 51 తహసీల్దార్‌, 5 ఆర్డీఓ కార్యాలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో జిల్లాలోని మూడు మండలాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న తహసీల్దార్‌ కార్యాలయాల్లో తిప్పలు తప్పనున్నాయి.

రామాయంపేట(మెదక్‌): రామాయంపేట మున్సిపల్‌ కమిషనర్‌గా శ్రావణ్‌ నియామకయ్యారు. గ్రూప్‌1లో ఎంపికై న ఆయన, మొదటి పోస్టింగ్‌ కమిషనర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన ని అన్నారు. ఈమేరకు కౌన్సిలర్‌ నాగరాజు తదితరులు నూతన కమిషనర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

నిజాంపేట(మెదక్‌): మండల కేంద్రంలోని పశువైద్యాధికారి సమయపాలన పాటించడం లేదని పాడి రైతులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బుధవారం గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఆస్పత్రికి వెళ్లగా, డాక్టర్‌ అందుబాటులో లేరు. దీంతో వారు నిరసన తెలిపారు. సరైన సమయంలో వైద్యం అందక మూగజీవాలు మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా వెటర్నరీ ఏడీకి సమాచారం ఇవ్వగా, ఆయన వెంటనే ఫిర్యాదు పత్రాన్ని వాట్సాప్‌ ద్వారా పంపించాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు రాజిరెడ్డి, శ్రీకాంత్‌, శ్రీరాములు, తిరుపతిరెడ్డి, పర్షరాములు, కనకరాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: హైదరాబాద్‌లో గురువారం నుంచి జరిగే జనగణన శిక్షణకు జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి ఎంపికయ్యారు. ఈసందర్భంగా బుధవారం ఆయన కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగే ఈ శిక్షణలో పాల్గొననున్నారు. జిల్లాలో వేసవిలో మొదటి దశలో జరిగే జన గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని రాజిరెడ్డి తెలిపారు.

నేడు, రేపు తాగు నీటి సరఫరా బంద్‌

మెదక్‌జోన్‌: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రెండు రోజుల పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నామని మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ఈఈ నాగభూషణం బుధవారం తెలిపారు. భగీరథ నీరు సరఫరా అయ్యే పైపులైన్లు పెద్దారెడ్డిపేట, ఎల్లాపూర్‌ ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని వాటి మరమ్మతుల కారణంగా ఈనెల 5, 6వ తేదీల్లో మెదక్‌ నియోజకవర్గంలోని 275 గ్రామాలకు, ఆందోల్‌ నియోజకవర్గంలోని అల్లాదుర్గం, టేక్మాల్‌ మండలాల పరిధిలోని 80 గ్రామాలు, మెదక్‌, రామాయంపేట మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నామన్నారు. కాగా ముందస్తుగా ఆయా గ్రామాల సర్పంచ్‌లకు సమాచారం అందించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement