వైజ్ఞానిక ప్రదర్శనలతో మేలు | - | Sakshi
Sakshi News home page

వైజ్ఞానిక ప్రదర్శనలతో మేలు

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

వైజ్ఞానిక ప్రదర్శనలతో మేలు

వైజ్ఞానిక ప్రదర్శనలతో మేలు

వెల్దుర్తి(తూప్రాన్‌): విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని డీఈఓ విజయ అన్నారు. సర్‌ సీవీ రామన్‌ జయంతిని పురస్కరించుకొని శని వారం మాసాయిపేట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండలస్థాయి సైన్స్‌ వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్టాళ్లను పరిశీలించి అభినందించారు. కొన్ని జాతీయ స్థాయిలో ఉండడంపై సంబంధిత గైడ్‌ ఉపాధ్యాయులను అభినందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. సర్కారు బడుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కిష్టారెడ్డి, ఎంఈఓ మధుసూదన్‌రావు, ఎంపీడీఓ విఘ్నేశ్వర్‌, తహసీల్దార్‌ జ్ఞానజ్యోతి, సైన్స్‌ ఉపాధ్యాయులు రంగారెడ్డి, భాగ్యలక్ష్మి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement