హోరాహోరీగా పోలీస్‌ క్రీడలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా పోలీస్‌ క్రీడలు

Mar 12 2026 9:08 AM | Updated on Mar 12 2026 9:08 AM

హోరాహోరీగా పోలీస్‌ క్రీడలు పేదలకు మెరుగైన వైద్యం ప్రజారోగ్యంతో చెలగాటమా?

మెదక్‌జోన్‌: పోలీస్‌ వార్షిక క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో రోజు బుధవారం పట్టణంలోని సింథటిక్‌ ట్రాక్‌పై అథ్లెటిక్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పరుగు పందెం, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. క్రీడ లతో శారీరక దృఢత్వం పెరగడంతో పాటు విధుల్లో చురుకుదనం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈసందర్భంగా విజేతలను అభినందించారు.

కొల్చారం(నర్సాపూర్‌): గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ఆవరణలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. కాగా వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సమస్య ఉన్న వారిని మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. వివిధ గ్రామాల నుంచి 215 మంది వైద్య శిబిరానికి హాజరైనట్లు వైద్యాధికారి రమేష్‌ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శేఖర్‌, ఎంపీహెచ్‌ఓ మ దన్మోహన్‌, సూపర్‌వైజర్‌ మార్తా, యేసుమని, శాంతి కుమార్‌, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

రామాయంపేట(మెదక్‌): పట్టణంలోని పలు హోటళ్లలో నాసిరకం పదార్థాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గజవాడ లావణ్య, కమిషనర్‌ శ్రావణ్‌ తనిఖీలు నిర్వహించారు. కొన్ని హోటళ్లలో పాచిపోయి దుర్వాసన వెదజల్లుతున్న నాసిరకం పదార్థాలను గుర్తించి పారబోయించారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తే ఊరుకోమని చైర్‌పర్సన్‌ హెచ్చరించారు. ఇది మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నామని, మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట వైస్‌ చైర్‌పర్సన్‌ నవనీత, కౌన్సిలర్లు వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement