మెదక్‌జోన్: మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించటం అత్యంత అవసరమని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, రుణ సౌకర్యాలు, ఉపాధి అవకాశాలతో మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


