కుస్తీమే సవాల్
చిన్నశంకరంపేట(మెదక్): ఉపాధి కూలీలకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఫొటో క్యాప్చర్ కాలేదని పనులకు నిరాకరించడంతో కూలీలు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని సూరారంలో బుధవారం ఉపాధి హామీ పథకంలో భాగంగా కందకం తవ్వకం పనులు నిర్వహిస్తున్నారు. పనుల కోసం వచ్చిన కూలీల ఫొటోలను ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో ఫీల్డ్ ఆసిస్టెంట్ రామకృష్ణారెడ్డి క్యాప్చర్ చేయగా, చాలా వరకు కాలేదు. దీంతో పనులు చేసేందుకు నిరాకరించారు. దీంతో ఉపాధి పనులకు వచ్చిన కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే మస్టర్ హాజరు నిర్వహించాలని కోరారు. ఈవిషయమై ఏపీఓ రాజ్‌కుమార్‌ను ఆరా తీయగా, ఈ సమస్య కొన్ని చోట్ల మాత్రమే ఉత్పన్నం అవుతుందని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.
తలపడుతున్న మల్లయోధులు
టేక్మాల్(మెదక్): మండల కేంద్రంలో దుర్గమ్మ, పోచమ్మ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీలకు రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మల్లయోధులు తరలివచ్చారు. కొబ్బరికాయ కుస్తీ మొదులుకొని కడి యం కుస్తీ వరకు పోటీలు హోరాహోరీగా సాగాయి. కర్ణాటకలోని లాతూర్‌కు చెందిన అభిషేక్ ఇద్దరిపై గెలుపొందడంతో సర్పంచ్ సుధాకర్ వెండి కడియాన్ని బహూకరించారు.


