పకడ్బందీగా ప్రజాపాలన | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ప్రజాపాలన

Mar 12 2026 9:08 AM | Updated on Mar 12 2026 9:08 AM

జెడ్పీ సీఈఓ

ఎల్లయ్య

అల్లాదుర్గం(మెదక్‌)/టేక్మాల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ పనులను పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం మండల పరిధిలోని ముస్లాపూర్‌లో పనులను పర్యవేక్షించి మాట్లాడారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరవన్నారు. ప్రతి గ్రామంలో వాటర్‌ ట్యాంకులను శుభ్రం చేసి, లీకేజీలను అరికట్టాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ మల్లయ్య, ఎంపీడీఓ చంద్రశేఖర్‌ ఉన్నారు. అనంతరం టేక్మాల్‌ మండల పరిధిలోని బొడ్మట్‌పల్లి పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ ప్రజాపాలనలో జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామస్తులు వందశాతం ఇంటి పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అవినాష్‌ కుమార్‌, పంచాయతీ కార్యదర్శి మౌనిక, నాయకులు రాందాస్‌, రవిశంకర్‌, నర్సింలు, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement