ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

ఆదర్శ

ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి

మెదక్‌ కలెక్టరేట్‌: రాష్ట్రంలోనే మెదక్‌ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. శనివారం కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ హైదరాబాద్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేసి ప్రజాప్రభుత్వానికి మరింత మంచి పేరు తేవాలన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. అధికారులను సమన్వయం చేసి ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తామన్నారు. తన శక్తి వంచనతో అహర్నిశలు పనిచేసి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెస్తామన్నారు.

‘అన్ని వసతులు కల్పించాలి’

మెదక్‌జోన్‌: పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని మెదక్‌ ఆర్డీఓ రమాదేవి సిబ్బందికి సూచించారు. శనివారం పట్టణంలోని పలు ఇంటర్‌ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. తాగునీరు, మెడికల్‌ కిట్లు, టాయిలెట్‌ వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అలాగే సీసీ కెమెరాల పనితీరు, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు వివరాలపై ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలు ఇవ్వాలన్నారు. ఎలాంటి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆ పరిశ్రమతో

ఇబ్బంది పడుతున్నాం

చిన్నశంకరంపేట(మెదక్‌): కావేరి పరిశ్రమ వెదజల్లే కాలుష్యంతో బతకలేకపోతున్నామని.. పరిశ్రమ సమీపంలోని పంట పొలాలు సైతం సాగు యోగ్యతను కోల్పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని ఖాజాపూర్‌ శివారు కావేరి పరిశ్రమ పరిసరాలతో పాటు చెరువును తహసీల్దార్‌ మాలతి పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు ఆమె ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. పరిశ్రమ నుంచి వెదజల్లుతున్న కాలుష్యంతో పాటు నల్లని దుమ్ము తమ పంటలకు నష్టం కలిగిస్తుందన్నారు. కంపెనీ పక్కన ఉన్న అంబారెడ్డి చెరువులో పరిశ్రమ వ్యర్థాలను వేయడంతో కలుషితం అవుతుందన్నారు. కాగా చెరువు ఎఫ్‌టీఎల్‌లో వేసిన డస్ట్‌ను వారం రోజుల్లో తొలగించాలని పరిశ్రమ మేనేజర్‌ను తహసీల్దార్‌ ఆదేశించారు. కాలుష్యంపై పీసీబీ అధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు.

సఖి, భరోసా

కేంద్రాలతో రక్షణ

మెదక్‌ కలెక్టరేట్‌: సఖి, భరోసా సెంటర్లు ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలుస్తున్నాయని లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ డిప్యూటీ చీఫ్‌ సిద్దాగౌడ్‌ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సూచనల మేరకు శనివారం పట్టణంలోని సఖి, భరోసా కేంద్రాలతో పాటు బాల సదనం సందర్శించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవి మహిళల రక్షణ, న్యాయం, సహాయం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమైన వేదికలని అన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్‌ ఉప్పలయ్య, సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ రేణుక, భరోసా సెంటర్‌ కోఆర్డినేటర్‌ సౌమ్య, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి  
1
1/2

ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి

ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి  
2
2/2

ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement