నిధులు వెచ్చించి.. పనులు చేయించి | - | Sakshi
Sakshi News home page

నిధులు వెచ్చించి.. పనులు చేయించి

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

నిధుల

నిధులు వెచ్చించి.. పనులు చేయించి

ప్రజాప్రతినిధుల సేవా కార్యక్రమాలు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు చిన్నశంకరంపేట సర్పంచ్‌ చంద్రశేఖర్‌ సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. రూ. 15 లక్షలు తన సొంత నిధులు వెచ్చించి సోమేశ్వర ఆలయం వద్ద శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పోచమ్మ, గంగమ్మ ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తున్నారు. మజీద్‌పై మొదటి అంతస్తు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో స్టేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ గజవాడ లావణ్య, కౌన్సిలర్‌ నాగరాజు దంపతులు బాధ్యతలు స్వీకరించగానే సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాలకు మరమ్మతులు, నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం, దహన సంస్కారాల నిమిత్తం సహాయం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నిజాంపేట మండలం చల్మెడ, నిజాంపేట, రజాక్‌పల్లి సర్పంచ్‌లు మల్లేశం, నరేందర్‌, కనకరాజు తమ గ్రామాల పరిధిలో నిరుపేదల యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందజేస్తూ చేదోడు, వాదోడుగా నిలుస్తున్నారు.

రామాయంపేట మండలం ఆర్‌ వెంకటాపూర్‌ సర్పంచ్‌ ఉమ సొంత నిధులతో శిథిలావస్థకు చేరిన బస్టాండును బాగు చేయించారు. గ్రామంలో వీధిలైట్లు ఏర్పాటు చేయించారు. నీటి ఎద్దడి నివారణకు మినీ ట్యాంకులు నిర్మిస్తున్నారు.

మనోహరాబాద్‌ సర్పంచ్‌ అనూష గ్రామంలో బోరు తవ్వించారు. నీటి ఎద్దడి నివారణకు త్వరలో మరో రెండు బోర్లు తవ్వించనున్నట్లు తెలిపారు.

కాళ్లకల్‌ సర్పంచ్‌ నవ్య గ్రామంలో నిరుపేద మహిళల వివాహాలకు ఆర్థిక సహా యం అందజేయడంతో పాటు ఎవరైనా నిరుపేదలు మృతి చెందితే దహన సంస్కారాల నిమిత్తం సహాయం చేస్తున్నారు.

వెల్దుర్తి మండలం మంగళ్‌పర్తి సర్పంచ్‌ సంధ్య నిరుపేద మహిళల వివాహాలకు రూ. 5,116 ఆర్థిక సహాయంతో పాటు కొత్త దుస్తుల కిట్‌ అందజేస్తున్నారు.

ప్రజాప్రతినిధుల సేవా కార్యక్రమాలు

స్కూల్‌ స్టేజీ నిర్మాణానికి సర్పంచ్‌ భూమి పూజ

ఇచ్చిన హామీ మేరకు..

రామాయంపేట(మెదక్‌): జిల్లాలో నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు సొంత నిధులతో తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిలో కొందరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుండగా, మరికొందరు సొంత డబ్బులతో పనులు చేయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లాలో యువతీ, యువకులే ప్రజాప్రతినిధులుగా గెలుపొందారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోయినా, తమ సొంత నిధులతో గ్రామాల్లో బోర్లు తవ్వించడం, వీధి దీపాల ఏర్పాటు, నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టైలు, బెల్ట్‌లు, మినీ ట్యాంకుల నిర్మాణం.. తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నిధులు వెచ్చించి.. పనులు చేయించి 1
1/1

నిధులు వెచ్చించి.. పనులు చేయించి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement