నేటి నుంచి జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

నేటి నుంచి జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌

నేటి నుంచి జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌

నేడు మల్లన్న ఏడోవారం

మెదక్‌ కలెక్టరేట్‌: నేటి నుంచి జిల్లాలో నెలరోజుల పాటు పోలీస్‌యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 30, 30(ఏ) పోలీస్‌యాక్ట్‌ అమలులో ఉంటుందన్నారు. దీని ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి ధర్నా లు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దన్నారు. అలాగే ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సత్తేటి వారాలలో భాగంగా ఏడో ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. శనివారం సాయంత్రానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. వేకువ జామున పుష్కరిణిలో స్నానమాచరించి మల్లన్నకు పట్నం వేసి బోనం సమర్పించి మొక్కులు సమర్పించుకోనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement