ప్రజలకు చేరువగా ‘ప్రజావాణి’
నిజాంపేట(మెదక్): ప్రజలకు దూరభారం తగ్గించడం కోసమే మండలస్థాయిలో ప్రజావాణి కార్య క్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఎంపీడీఒ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీ కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి 42 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మండలస్థాయిలో కార్యక్రమం బలోపేతానికి నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. పరిష్కారం కాని సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యా దుదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు, పోలీస్ పరిధిలో ఉన్న భూముల వివరాలు సంబంధిత శాఖలకు పంపించాలన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్ చేసి, వారం రోజుల్లో పరిష్కారం చూపుతామన్నారు. ప్రజలు జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే వారి సమస్యలకు పరిష్కారం దొరికేలా అధికారులు చర్యలు చేపట్టా లని సూచించారు. ప్రతి సోమవారం అధికారులందరూ తప్పకుండా ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయానికి స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఒ రాజిరెడ్డి, వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, రెవెన్యూ, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్


