విద్యార్థులు ఇబ్బంది పడొద్దు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఇబ్బంది పడొద్దు

Feb 28 2026 8:41 AM | Updated on Feb 28 2026 8:41 AM

విద్యార్థులు ఇబ్బంది పడొద్దు

విద్యార్థులు ఇబ్బంది పడొద్దు

నర్సాపూర్‌: ఇంటర్‌ పరీక్ష కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె పట్టణంలోని మైనార్టీ గురుకుల కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తాగు నీరు, కరెంట్‌ వసతి, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. అలాగే మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలెక్టర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి, సంక్షేమంలో జిల్లాను ముందంజలో ఉంచాలని మంత్రి సూచించారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement