డీఈఓ విజయ
పాపన్నపేట(మెదక్): విద్యార్థులు పరీక్షల మధ్య ఉన్న వ్యవధిని వినియోగించుకొని మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ విజయ సూచించారు. గురువారం మండలంలోని నాగ్సాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సుమారు 34 రోజుల పాటు సాగే పరీక్షల్లో, ఒక్కో పరీక్షకు మధ్య చాలా విరామం దొరుకుతుందని తెలిపారు. ఈ సమయాన్ని వృథా చేయొద్దన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పక్కా ప్రణాళికతో చదివితే లక్ష్యం సాధించవచ్చని చెప్పారు. అనంతరం పాఠశాల అభివృద్ధి కోసం రూ.లక్ష విరాళమిచ్చిన గ్రామస్తుడు వట్టం సంగమేశ్వర్‌ను డీఈఓ ఘనంగా సన్మానించారు. మన ఊరు, మన బడికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ చంద్రమ్మ, సర్పంచ్ దండెం సుశీల, హెచ్‌ఎం నజీరొద్దీన్, ఏఎంఓ సుదర్శణమూర్తి, ఏఎస్‌ఓ నవీన్, సీఎంఓ రాజు, రిటైర్డ్ హెచ్‌ఎంలు మహిపాల్‌రెడ్డి, రాంకిషన్, సాయికృష్ణ, టీచర్లు శ్రీనివాస్, అశోక్ కుమార్, నర్సింలు, సిద్దేశ్వర్, రేఖ, ముజీబ్, విద్యార్థులు పాల్గొన్నారు.


