మెదక్ కలెక్టరేట్: సామాజిక ఆర్థిక సర్వేకు జిల్లాలోని ప్రజలంతా సహకరించాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సురేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సీపీఓ కార్యాలయంలో మండల ప్రణాళిక, గణాంక అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి నుంచి ప్రారంభమైన సర్వే ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగుతుందని తెలిపారు. సామాజిక ఆర్థిక సర్వే ద్వారా దేశంలోని ఉపాధి, నిరుద్యోగుల స్థితిగతులు, కార్మిక శక్తి పరిస్థితులు, నమోదు కాని పారిశ్రామిక, వాణిజ్య సేవా రంగాల ఆర్థిక అంశాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తామన్నారు. ఖచ్చితమైన గణాంకాలు సిద్ధం చేసేందుకు జిల్లాలోని ప్రజలంతా సహకరించాలని కోరారు. అంతకుముందు ఫీల్డ్ సిబ్బందికి ట్యాబ్స్ అందించా రు. కార్యక్రమంలో గణాంక అధికారి పద్మజ, ఉపగణాంక అధికారులు రవి, శ్రీనివాస్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ట్యాబ్స్‌తో ఫీల్డ్ సిబ్బంది, అధికారులు
జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సురేష్


