పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

 పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

మెదక్‌ కలెక్టరేట్‌: ఇంటర్‌ పరీక్షలను హైపవర్‌ కమిటీతో పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్‌ మీడియెట్‌ అధికారులకు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సూచించారు. సోమవారం వారితో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈనెల 25 నుంచి నిర్వహించే ఇంటర్‌ పరీక్షలకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్స్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈసారి కొత్తగా క్యూఆర్‌ కోడ్‌తో హాల్‌ టికెట్లు ఇస్తున్నామని, నేరుగా ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకోవచ్చన్నారు. హాల్‌ టికెట్‌ సమస్యల పరిష్కారానికి 7671033323 నంబర్‌ను అందుబాటులో ఉంచామన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి మాధవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement