పెండింగ్‌లో ఫైళ్లు ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌లో ఫైళ్లు ఉండొద్దు

Mar 9 2026 7:11 AM | Updated on Mar 9 2026 7:11 AM

పెండింగ్‌లో ఫైళ్లు ఉండొద్దు అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు పెండింగ్‌లో ఉండొద్దని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన– ప్రగతి’ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం అదనపు ఎస్పీ నగేశ్‌తో కలిసి కలెక్టరేట్‌లో ఫైళ్ల క్లియరెన్స్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పా రు. వేసవి దృష్ట్యా తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌ సమీపంలోని ఈవీఎంల గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఏఓ యూనస్‌, కలెక్టరేట్‌లోని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement