ప్రతి పనిలో సైన్స్‌ ఇమిడి ఉంది | - | Sakshi
Sakshi News home page

ప్రతి పనిలో సైన్స్‌ ఇమిడి ఉంది

Feb 28 2026 8:41 AM | Updated on Feb 28 2026 8:41 AM

ప్రతి పనిలో సైన్స్‌ ఇమిడి ఉంది

ప్రతి పనిలో సైన్స్‌ ఇమిడి ఉంది

రామాయంపేట(మెదక్‌): మనం చేసే ప్రతి పని లో సైన్స్‌ ఇమిడి ఉందని జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని వివేకానంద విద్యాలయంలో సైన్స్‌ ఫెయిర్‌ను ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో సైన్స్‌ లేనిదే ఏపని చేయలేమని, విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తి చూపడం సంతోషకరమన్నారు. ఈసందర్భంగా రెండు వందల ప్రదర్శనలు తిలకించారు. మట్టి లేకుండా కేవలం నీటితో పండించే వ్యవసాయానికి సంబంధించి ప్రాజెక్టును పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఆయన వెంట రేంజ్‌ అధికారి విద్యాసాగర్‌, ఎకై ్సజ్‌ సీఐ నరేందర్‌, ఎస్‌ఐలు విజయ్‌ సిద్దార్థ, హరీశ్‌, ప్రిన్సిపాల్‌ రాంకుమార్‌, ఎంఈఓ శ్రీనివాస్‌ ఉన్నారు.

డ్రైవర్లకు కంటిచూపు

చాలా ముఖ్యం

మెదక్‌జోన్‌: బస్సు డ్రైవర్ల కంటి చూపు సరిగా ఉంటేనే ప్రమాదాలు జరగవని అదనపు ఎస్పీ మహేందర్‌ అన్నారు. అరైవ్‌ అలైవ్‌ రెండో దశ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డిపో ప్రాంగణంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించారు. దూరదృష్టి లోపంతో పాటు కంటి సమ స్యలున్న డ్రైవర్లను గుర్తించారు. పలువురికి ఉచితంగా కళ్ల అద్దాలను పంపిణీ చేశారు. అంతకుముందు డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమా లు తదితర వాటిపై అవగాహన కల్పించారు. అధిక వేగం, క్రమశిక్షణ లోపం, అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారితీస్తాయని వివరించారు. కా ర్యక్రమంలో డిపో మేనేజర్‌ సురేఖ, టౌన్‌ సీఐ మహేష్‌, ఆర్టీసీ, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

‘ఆ రిపోర్ట్‌ విడ్డూరం’

చిన్నశంకరంపేట(మెదక్‌): ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై రిపోర్టు ఇవ్వాల్సిన విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి ఉపాధ్యాయుల వేతనాలపై ఇవ్వడం విడ్డూరంగా ఉందని పీఎస్‌హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలయ్య అన్నారు. ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనం దేశ భవిష్యత్తుపై ముడిపడి ఉందని గుర్తించాలన్నారు. మార్కెట్‌ ప్రమాణాలతో పోలిస్తే టీచర్ల వేతనాలు తక్కువగానే ఉన్నాయన్నారు. పాఠశాలల బలోపేతం పాటు మౌలిక వసతులు, అభ్యాసన ప్రక్రియ మెరుగుకోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక అందించాలన్నారు. కమిషన్‌ ఇచ్చిన రిపోర్టులో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నా యి, తగ్గించాలనే ప్రస్తావనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వీసీని వెంటనే

తొలగించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

మెదక్‌ కలెక్టరేట్‌: ఢిల్లీలోని జేఎన్‌యూ వీసీ శాంతిపండిత్‌ను వెంటనే తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం విద్యార్థులతో కలిసి పట్టణంలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల క్రితం యూనివర్సిటీలో సమస్యలపై ప్రశ్నించిన వి ద్యార్థులు, అధ్యాపకులపై కొంతమంది కులం, మతం పేరుతో దూషించి కొట్టినట్లు ఆరోపించారు. అంతేకాకుండా యూనివర్సిటీలో ధర్నా లు చేయొద్దని, సమస్యలపై మాట్లాడొద్దని బెదిరించిననట్లు వాపోయారు. పోలీసులు క్యాంపస్‌లో ఉండి కూడా ఏం చేయలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement