చిన్నారులతో మాట్లాడుతున్న
ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా
బుడి బుడి అడుగులతో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆట, పాటలతో కూడిన విద్యను అందిస్తున్నారు. సోమవారం మండలంలోని రెడ్డిపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా సందర్శించారు. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా తదితర వాటిని పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పోషకాహారాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట డీడబ్ల్యూఓ హేమాభార్గవి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
– నర్సాపూర్ రూరల్


