నేటి నుంచే ఇంటర్ పరీక్షలు
మెదక్ అర్బన్: ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. మంగళవారం మెదక్‌లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 28 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షలకు సంబంధించి, విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 25 నుంచి మార్చి 16 వరకు పరీక్షలు జరుగనున్నాయని వివరించారు.
జిల్లాలో 12,334 విద్యార్థులు
జిల్లాలో మొత్తం 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రథమ సంవత్సరంలో 6309, ద్వితీయ సంవత్సరంలో 6025 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం 514 మంది పరిశీలకులను నియమించామన్నారు. ప్రతి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించారని, కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రాల లొకేషన్ తెలుస్తుందన్నారు. పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి గురవుతే టెలీమానస్ 14416కు ఫోన్ చేస్తే నిపుణులు వచ్చి,సంబంధిత విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని చెప్పారు.అలాగే విద్యారుల సమస్యలను నివృత్తి చేసుకోవడానికి 7671033323, 9603615652కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్


