ప్రతిపాదించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: వేసవిలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రూ.27కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రఘువీర్, ఇంట్రా ఈఈ శేఖ్ పాష, గ్రిడ్ ఈఈ నాగభూషణం, డిప్యూటీ ఈఈ ఫణివర్మ, ఏఈలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఖేడ్ నియోజకవర్గంలో నీటి ఎద్దడి పరిష్కారానికి రూ.7కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టు నుంచి కంగ్టి మండలంలోని 40 గ్రామాలు (హ్యాబిటేషన్లు), జుక్కల్ నియోజకవర్గంలోని 30 గ్రామాలకు నీటి సరఫరాకు రూ.20కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లోని 42వరకు బోర్ల ఫ్లష్షింగ్, డీపనింగ్‌కు రూ.30లక్షలు, 111 గ్రామాలకు హైరింగ్ ద్వారా నీటి సరఫరాకు రూ.25 లక్షలు, అత్యవసర పరిస్థితుల్లో రవాణా ద్వా రా నీటి సరఫరాకు రూ.1.5కోట్లు అవసరం అని గుర్తించామన్నారు.


