పుల్‌కల్(అందోల్): సింగూరు కాలువ సిమెంట్ లైనింగ్ పనులు పునఃప్రారంభమైనాయి. గతేడాది గుత్తేదారు పనులు ప్రారంభించిన అనంతరం వానాకాలం రావడంతో సాగునీటికి ఇబ్బంది కలుగుతుందని పనులను నిలిపివేశారు. ప్రస్తుతం డ్యాం మట్టికట్టకు మరమ్మతులు జరుగుతున్నందున యాసంగి పంటలకు విరామం ప్రకటించారు. దీంతో కాలువ సిమెంట్ లైనింగ్ పనులను కూడా గుత్తేదారు ప్రారంభించారు. ప్రస్తుతం కాలువలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి కాలువను మార్కింగ్ చేసుకుంటున్నారు.
సంగారెడ్డి టౌన్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న సీతారామచంద్రుల కల్యాణోత్సవ ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందించనున్నట్లు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. ఇందుకోసం భక్తులు ఆన్‌లైన్ ద్వారా రూ.151 చెల్లించి https:// www.tgsrtclogistics. gov.in ద్వారా తలంబ్రాలు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. డిపో కార్యాలయంలో బుధవారం తలంబ్రాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. తలంబ్రాలు కావాల్సిన వారు ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్‌లలో కూడా సంప్రదించవచ్చన్నారు.


