మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఏదో ఒక రకంగా తాగు నీరు లభించే అవకాశాలు ఉంటాయి. కానీ అడవుల్లో ఆ వెసులుబాటు ఉండదు. ఉన్న వాగులు, వంకలు ఎండలకు పూర్తిగా అడుగంటుతాయి. ఈక్రమంలో వన్యప్రాణులు తాగు నీటి కోసం వెంపర్లాడుతుంటాయి. కౌడిపల్లి లోత్‌వాగ్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన సాసర్‌పిట్లు ధ్వంసమై ఇలా దర్శనమిచ్చాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి వాటికి మరమ్మతులు చేయించి నీరు అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు.
– కౌడిపల్లి(నర్సాపూర్)


