న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని ముంగి తండా పరిధిలో గల నిమ్జ్ ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం పోలీస్ బందోబస్తు మధ్య సరిహద్దు రాళ్ల ఏర్పాటు ప్రారంభమైంది. తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందించడంతోపాటు తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే నిమ్జ్ పనులు చేపట్టాలని నిమ్జ్ భూ బాధితులు, తండా వాసులు రెండు రోజులుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం ఉదయం తండాకు చేరుకుని భారీ పోలీస్ బందోబస్తు మధ్య సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తండాలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ అధ్వర్యంలో 52 మంది పోలీస్‌ల బందోబస్తు మధ్య తహాసీల్దార్ ప్రభులు, ఆర్‌ఐ శ్యామ్‌రావు, సర్వేర్, ఇతర సిబ్బంది హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు.


