చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Mar 13 2026 9:03 AM | Updated on Mar 13 2026 9:03 AM

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

కంది(సంగారెడ్డి)/సంగారెడ్డి జోన్‌: నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని కందిలో కలెక్టర్‌ ప్రావీణ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, గ్రామ సర్పంచులు కౌన్సిలర్లకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’99 రోజుల కార్యచరణ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి దామోదర పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌ ఆవరణలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం సీఎస్‌ఆర్‌ నిధులతో మెడికల్‌ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...99 రోజుల కార్యచరణను ఐదు దశలు, పది అంశాలుగా రూ పొందించామన్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి సారించాలని సూ చించారు. ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణీలు, చిన్నారులకు పోషకాహార అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి..

రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్ర భు త్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement