కష్టపడి కాదు.. ఇష్టంతో చదవాలి
డీఈఓ విజయ
వెల్దుర్తి(తూప్రాన్): మార్చిలో ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ విజయ తెలిపారు. మండలంలోని కుకునూర్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. మధ్యాహ్న భోజనం, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల సమయం దగ్గరగా ఉన్నందున కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. జిల్లాలో 11,217 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరుకానుండగా, 68 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులను కల్పించామన్నారు. జిల్లాలో శతశాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు చెప్పారు.


