మెదక్ కలెక్టరేట్: ప్రజలు తడి, పొడి చెత్తపై అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్‌గౌడ్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 1, 12, 18 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా వార్డుల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, శానిటేషన్ సిబ్బంది, ఆర్పీలు, వార్డుల ప్రజలు పాల్గొన్నారు.


