పెన్షన్లు పెంచండి
మెదక్ కలెక్టరేట్: దివ్యాంగుల పెన్షన్లను ప్రభుత్వం వెంటనే రూ.6 వేలకు పెంచాలని దివ్యాంగుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి యశోద డిమాండ్ చేశారు. ఎన్‌పీఆర్డీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికీ దివ్యాంగుల పెన్షన్లు పెంచడం లేదన్నారు. 2023 నుంచి కొత్త పెన్షన్ల కోసం 24.85 లక్షల మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. సహాయ పరికరాల కోసం లబ్ధిదారుల ఎంపిక జరిగి ఏడాది గడుస్తున్నా, నేటికీ పూర్తిస్థాయిలో పరికరాలు పంపిణీ చేయలేదన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ స్థానంలో కొత్త చట్టం తేవడం అన్యాయం అన్నా రు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ నగేశ్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీ జిల్లా అధ్యక్షుడు ముత్యాలు, జిల్లా ఉపాధ్యక్షు లు యాదగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా నాయకులు త దితరులు పాల్గొన్నారు.


