వ్యవసాయానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి పెద్దపీట

Mar 3 2026 9:07 AM | Updated on Mar 3 2026 9:07 AM

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్‌: వ్యవసాయ రంగం అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మనూరు మండలం దుదగొండ పంచాయతీ పరిధిలోని గట్టులింగంపల్లి పెద్దచెరువుకు రూ.48.7లక్షల వ్యయంతో చేపట్టనున్న మరమ్మతు పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు మరమ్మతుల కారణంగా కుడి కాలువ 1.4కిలోమీటర్లు, ఎడమ కాలువ 1.2కిలోమీటర్ల మేర 300 ఎకరాల వరకు ఆయకట్టుకు నీరందనుందని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ డిప్యూటీ ఈఈ జలందర్‌, ఏఈలు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు భోజిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, శేరి రాజు, శ్రీకాంత్‌రెడ్డి, చంద్రలీలా, ప్రతిభ అనిల్‌ పాటిల్‌ పాల్గొన్నారు. ఇదే గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమా ఖ్య భవనానికి శంకుస్థాపన చేశారు. ఖేడ్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన లక్ష్మిబాయికి కల్యాణలక్ష్మి చెక్కు, ఆరె మారుతిరావుకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన రూ.60 వేలకు సంబంధించిన చెక్కును అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement