మెతుకుసీమపై రాజ్‌ ముద్ర | - | Sakshi
Sakshi News home page

మెతుకుసీమపై రాజ్‌ ముద్ర

Feb 27 2026 10:47 AM | Updated on Feb 27 2026 10:47 AM

మెతుకుసీమపై రాజ్‌ ముద్ర

మెతుకుసీమపై రాజ్‌ ముద్ర

విద్య, వైద్యాభివృద్ధికి కృషి ● కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ బదిలీ

మెదక్‌జోన్‌: కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ బదిలీ అయ్యారు. గురువారం కమిషనర్‌ రేట్‌ కోఆపరేటివ్‌ సహకార రిజిస్ట్రేషన్‌ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 2024 మార్చి 5న జిల్లాకు బదిలీపై వచ్చిన ఆయన, మెతుకుసీమపై తనదైన ముద్ర వేశారు. నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలతో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చారు. కలెక్టరేట్‌లోని ప్రతిశాఖలో ఈ–ఆఫీస్‌ సేవలు ప్రా రంభించారు. జిల్లాస్థాయి అధికారులందరూ స్థాని కంగానే ఉండాలని, అద్దెకు ఉంటున్న వారి అడ్రస్‌లు తీసుకున్నారు. జిల్లా విడిచి ఎవరూ బయటకు వెళ్లినా తనకు సమాచారం ఇవ్వాలని, లేనిచో శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని ఆదేశాలు జారీ చేశారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ‘గ్రౌండ్‌ బేస్డ్‌ లర్నింగ్‌’ను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేశారు.

బడిబాట.. పల్లెనిద్ర

దో తరగతి పాస్‌ అయిన విద్యార్థులు ఇంటర్‌లో చేరే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరిని ఇంటర్‌లో చేర్పించే బాధ్యతను లెక్చరర్లకు అప్పగించారు. అలాగే బడిబాట కార్యక్రమంలో భాగంగా గతేడాది నర్సాపూర్‌ మండలంలోని ఓ మారుమూల గ్రామంలో పల్లెనిద్ర చేశారు. ఉద యం ఇంటింటికీ తిరుగుతూ, డ్రాప్‌అవుట్‌ పిల్లల ను బడిలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రుల కు సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శనకు ప్రత్యేక స్థానం కల్పించారు. ఈఏడాది రాష్ట్రం నుంచి 21 మంది విద్యార్థులు ఎంపికకాగా, అందులో జిల్లా నుంచి నలుగురు ఎంపికావడం గమనార్హం.

ప్రభుత్వ ఆస్పత్రులపై పర్యవేక్షణ

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలని, ప్రతి వైద్యుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆస్పత్రులను నిరంతరం తనిఖీలు చేశారు. విధులకు ఎగనామం పెట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. అన్ని పీహెచ్‌సీలలో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసి కలెక్టరేట్‌కు అనుసంధానం చేశారు. దీంతో వైద్యులు విధులకు ఎప్పుడు వస్తున్నారు.. ఎప్పుడు వెళ్తున్నారని స్వయంగా పర్యవేక్షించారు.

వినూత్న కార్యక్రమాలు

పా్లస్టిక్‌ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ అమలు చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా కలెక్టరేట్‌ నుంచే ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లుగా కలెక్టరేట్‌లో కనీసం ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ కూడ రాకుండా నిషేధించారు. సిబ్బంది హెల్మెంట్‌ లేకుండా కలెక్టరేట్‌లోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. స్వయంగా తన సతీమణితో కలిసి మెదక్‌ నుంచి నర్సాపూర్‌ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సమస్యలు తెలుసుకున్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణలో నిర్వహించారు.

నూతన కలెక్టర్‌గా ప్రతిమాసింగ్‌

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా విధు లు నిర్వర్తించిన ప్రతిమాసింగ్‌ పదోన్నతిపై మెదక్‌ కలెక్టర్‌గా వచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. కాగా 2019లో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థల)గా సుమారు రెండేళ్ల పాటు మెతుకుసీమ లో ఆమె పని చేశారు. అప్పట్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించారు. జిల్లావ్యాప్తంగా గ్రామ గ్రామాన సూచిక బోర్డులను ఏర్పాటు చేయించారు. డంప్‌యార్డుల నిర్మాణాలు, వైకుంఠధామాల ఆమె అదనపు కలెక్టర్‌గా ఉన్న సమయంలోనే నిర్మాణాలు చేపట్టారు.

అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు

రామాయంపేట(మెదక్‌)/తూప్రాన్‌/కౌడిపల్లి(నర్సాపూర్‌): జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులను బుధవారం అర్ధరాత్రి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తూప్రాన్‌ సీహెచ్‌సీని సందర్శించారు. రోగులకు అందిస్తున్న ఎమర్జెన్సీ కేసుల వివరాలు, ఆస్పత్రి పనితీరును పర్యవేక్షించారు. అప్పుడే ప్రమాదవశాత్తు గాయాలతో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులతో మాట్లాడి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కౌడిపల్లిలోని సీహెచ్‌సీని తనిఖీ చేసి ఓపీ, అటెండెన్స్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు. అలాగే రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ కేసుల వివరాలకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement