ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

Feb 23 2026 9:00 AM | Updated on Feb 23 2026 9:00 AM

ఎమ్మె

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

ఆందోళన చేస్తున్న హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు

పెద్దశంకరంపేట(మెదక్‌): గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి జిల్లా బాన్సువాడ వెళ్తున్నారనే సమాచారంతో పెద్దశంకరంపేటలో ఉదయం ఎమ్మెల్యేను మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేశారనే సమాచారంతో భజరంగ్‌దళ్‌, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. అనంతరం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది పిట్లం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆద్దాలను పగలగొట్టారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ప్రత్యేక బందోబస్తు మధ్య పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రహదారిపై ఆందోళన చేస్తున్న హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు. నిర్మల్‌ జిల్లా ఓలా గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకున్నారని, హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండి ధర్మ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

పెద్దశంకరంపేటలో ఉద్రిక్తత

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌ 1
1/1

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement