స్పోర్ట్ ్సమీట్‌లో అద్భుత ప్రదర్శన
మెదక్ కలెక్టరేట్: పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి ఆరు రజత పతకాలు సాధించడం హర్షణీయమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా వారం రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర 4వ స్పోర్ట్స్‌మీట్‌లో జిల్లాకు చెందిన రాథోడ్ రమేష్ టెన్నిస్ సింగిల్స్, టెన్నిస్ డబుల్స్, గ్రూప్ ఈవెంట్‌లలో పాల్గొని మూడు రజత పతకాలు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే మెదక్ జిల్లాకు చెందిన భవాని, వీణ, సుష్మ కబడ్డీ పోటీల్లో కీలక పాత్ర పోషించి తమ జట్టును మూడో స్థానానికి తీసుకువచ్చారు. జిల్లాకు పతకాలు తీసుకొచ్చిన క్రీడాకారులందరినీ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ రంగనాథ్, ఆర్‌ఐ లు శైలందర్, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐ మహిపాల్. సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ శ్రీనివాసరావు


