సాధికారతతో సమాజాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సాధికారతతో సమాజాభివృద్ధి

Mar 10 2026 1:22 PM | Updated on Mar 10 2026 1:22 PM

మెదక్‌ కలెక్టరేట్‌: మహిళా సాధికారతే సమాజాభివృద్ధికి పునాది అని అదనపు ఎస్పీ మహేందర్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కు టుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలోనే కాకుండా దేశ అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతున్నారని వివరించారు. పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది ధైర్యం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి మహిళా పోలీస్‌ సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్‌, ఆర్‌ఐ శైలందర్‌, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

అదనపు ఎస్పీ మహేందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement