నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజలు తమ సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధా న కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను నేరుగా ఆయనకు వివరించారు. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా సంప్రదించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా సాధించడం జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
అదనపు ఎస్పీ మహేందర్


