నేడు జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్
మెదక్ కలెక్టరేట్: నేడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి భౌతిక, రసాయనశాస్త్ర టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఫిజికల్‌సైన్స్ ఫోరం డివిజన్ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు. ఈనెల 18న నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. జిల్లాస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ముగ్గురు విద్యార్థులు ఈనెల 28న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్‌లో పాల్గొంటారని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ నగేశ్, డీఈఓ విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్‌మూర్తి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.
చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. సైక్లింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడాధికారి వెంకటనర్సయ్య మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 400 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారన్నారు.


