మరో 15 రోజుల్లో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఇటీవల ప్రకటించారు.దీంతో కాంగ్రెస్‌ నేతల్లో ఆశలు చిగురించాయి. ఇటీవల పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అవకాశం దక్కని వారు, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిక | - | Sakshi
Sakshi News home page

మరో 15 రోజుల్లో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఇటీవల ప్రకటించారు.దీంతో కాంగ్రెస్‌ నేతల్లో ఆశలు చిగురించాయి. ఇటీవల పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అవకాశం దక్కని వారు, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిక

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

మరో 15 రోజుల్లో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తామని పీ

మరో 15 రోజుల్లో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తామని పీ

మరోసారి తెరపైకి అంశం ఆశల పల్లకీలో కాంగ్రెస్‌నాయకులు జిల్లాలో ఖాళీగా ఐదు మార్కెట్‌ కమిటీలు కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు

ఏడుపాయలకు ఎప్పుడు?

రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందిన ఏడుపాయల దేవస్థానానికి పాలకవర్గం లేకుండానే రెండున్నరేళ్లుగా నెట్టుకొస్తున్నారు. దీంతో అధికారులు, ఆలయ పరిధిలోని టెండర్‌దారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. ఏటా శివరాత్రి, ఉగాది, మాఘ అమావాస్యకు జరిగే జాతర కోసం ప్రభుత్వం రూ. కోట్లాది నిధులు విడుదల చేస్తుండగా, తాత్కాలిక పనులు మాత్రమే చేస్తూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అదే పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రతీ పైసాకు లెక్కలు ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. పాలకమండలిలో మొత్తం 14 మంది ఉండగా, చైర్మన్‌తో పాటు 13 మంది డైరెక్టర్లు ఉంటారు. కాగా ఆలయ కమిటీ చైర్మన్‌గా ఇప్పటివరకు అత్యధికంగా ఓసీ వర్గానికి చెందిన వారు మాత్రమే పనిచేశారు.

జిల్లాలో ఐదు మార్కెట్‌ కమిటీలకు మూడేళ్లుగా పాలకవర్గాలను నియమించలేదు. చైర్మన్‌ పోస్టులకు మాత్రం గతంలోనే ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. మెదక్‌, నర్సాపూర్‌ బీసీ(బీ), తూప్రాన్‌ (ఓసీ) మహిళ, పాపన్నపేట (ఎస్సీ) జనరల్‌, రామాయంపేట (ఎస్టీ) జనరల్‌కు అవకాశం రావటంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాగా చేగుంట (ఓసీ) జనరల్‌కు కేటాయించడంతో ఇటీవల వెంగళరావు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఒక్కో మార్కెట్‌ కమిటీలో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. వారిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు మరో 12 మంది డైరెక్టర్లు, నలుగురు సభ్యులుగా ఉంటారు. వారిలో వ్యవసాయశాఖ ఏడీ, మార్కెట్‌ కమిటీ అధికారి, సొసైటీ చైర్మన్‌తో పాటు మార్కెట్‌ కమిటీ గ్రామ పరిధిలో ఉంటే సర్పంచ్‌, మున్సిపల్‌ పరిధిలో ఉంటే చైర్మన్‌ సభ్యులుగా ఉంటారు.

పాలకవర్గాలు లేక మూడేళ్లు

మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలు లేక మూడేళ్లు అవుతోంది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. ముఖ్యంగా ధాన్యం సేకరణ సమయంలో పాలకవర్గం ఉంటే కొనుగోళ్ల కమీషన్‌ వస్తోంది. అలాగే కందులు, మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయటం, వాటికి ప్రభుత్వ మద్దతు ధర కల్పించటం, రైతులకు సబ్సిడీపై పరికరాలకు అందుబాటులో ఉంచటం, మార్కెట్‌ కమిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కృషితో నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంటుంది. కాగా ఏళ్ల తరబడి పాలకవర్గాలు లేకపోవటంతో కమిటీలు నీరసించి పోతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement