నారాయణఖేడ్: మహిళల అభ్యున్నతి వారి సాధికారితతోనే ముడిపడి ఉందని, మహిళా ఎంపవర్‌మెంట్‌కు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రిలో సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి మహిళా ఉద్యోగులు, సిబ్బందిని ఎమ్మెల్యే సన్మానించారు. క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు బాలికలకు స్వయంగా వ్యాక్సిన్ వేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..14 ఏళ్లుపై బడిన బాలికలు, యువతులు విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోందన్నారు. అలాగే ఖేడ్ శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల 44వ వార్షికోత్సవంలో కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహరాజ్‌తో కలిసి సంజీవరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి


