ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి
ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి కోరారు. గురువారం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. రైతుల ఖాతాల్లో రూ.10 లక్షలు జమ చేస్తే వారికి సాగు కోసం ఉపయోగపడడంతో పాటు తమ ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు ఉపయోగపడతాయన్నారు. రైతుభరోసా వెంటనే విడుదల చేయాలని, ఎన్నికలప్పుడు ప్రకటించిన మేరకు పాత బకాయిలు సైతం ఇవ్వాలని కోరారు. సబ్సిడీ యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యంత్రాలతో పాటు చిన్న, సన్నకారు రైతులకు చిన్న ట్రాక్టర్లు సైతం సబ్సిడీపై ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. పంట మార్పిడి చేయాలని, ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఏడీఏలు సంధ్యారాణి, పుణ్యవతి, మండల వ్యవసాయాధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు.


