ప్రజలు నేరుగా కలవొచ్చు | - | Sakshi
Sakshi News home page

ప్రజలు నేరుగా కలవొచ్చు

Mar 3 2026 9:07 AM | Updated on Mar 3 2026 9:07 AM

ప్రజలు నేరుగా కలవొచ్చు రాహుల్‌గాంధీని కలిసిన డీసీసీ చీఫ్‌ చిరుధాన్యాల సాగుతో లాభాలు ‘మోడల్‌’ ప్రవేశాల గడువు పొడిగింపు ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన

మెదక్‌జోన్‌: ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రజలు తనను నేరుగా కలవొచ్చని ఎస్పీ శ్రీనివాస్‌రావు ప్రజలకు సూచించారు. సోమ వారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి వినతులు స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించామని, ప్రజల్లో పోలీస్‌శాఖపై నమ్మ కం పెరిగిందన్నారు.

నర్సాపూర్‌: వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో జరగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి సోమవారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆయనను కలిశారు. వారం రోజులుగా కొనసాగిన శిక్షణలో పార్టీ సంస్థాగత బలోపేతం, సమస్యలపై అనుసరించాల్సిన పోరాట వ్యూహాలపై అవగాహన కల్పించారు.

టేక్మాల్‌(మెదక్‌): రైతులు వాణిజ్య పంటలే కాకుండా చిరుధాన్యాలు సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని మిల్లెట్‌ మ్యాన్‌ఆఫ్‌ తెలంగాణ వీర్‌శెట్టి అన్నారు. సోమవారం మండలంలోని కుసంగిలో రైతు వెంకటేశం సాగుచేస్తున్న జొన్న, సజ్జ, రాగి, ఊద, అరికె వంటి పంటలతో పాటు కుసుమ, మొక్కజొన్న పంటలను ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు అనిల్‌, నరేష్‌బొమ్మైతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండెకరాల్లో పదికిపైగా చిరు ధాన్యాల పంటలను సాగు చేయడం అభినందనీయమన్నారు. గ్రామా ్లోని రైతులు సంఘటితమై చిరు ధాన్యాలు సాగు చేయాలని కోరారు. ఆయన వెంట రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు మెగిలయ్య, రైతులు తదితరులు ఉన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని మోడల్‌ స్కూళ్లలో 2026– 27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ విజయ తెలిపారు. మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్త అడ్మిషన్లు 7, 8, 9 ,10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఆసక్తి, అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నర్సాపూర్‌ రూరల్‌: వ్యవసాయ, ఉద్యానశాఖల ఆధ్వర్యంలో నర్సాపూర్‌ రైతులు సోమవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న భాగ్యలక్ష్మి అనే మహిళా రైతు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆయిల్‌పామ్‌ పంట సాగు దిగుబడిపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి సంతోష్‌, వ్యవసాయశాఖ ఏఈఓ మోహన్‌, ఆయిల్‌పామ్‌ టెక్నికల్‌ పర్సన్‌ అజయ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement