సీ్త్రనిధి బకాయిలపై | - | Sakshi
Sakshi News home page

సీ్త్రనిధి బకాయిలపై

Mar 3 2026 9:07 AM | Updated on Mar 3 2026 9:07 AM

జిల్లాలో పేరుకుపోయిన రూ.18 కోట్లు

జిల్లాలో పేరుకుపోయిన రూ.18 కోట్లు

ఈనెలాఖరు వరకు అవకాశం

చెల్లించకుంటే ఆస్తులు జప్తు

జిల్లాలో 16,866 సంఘాలు

జిల్లాలో మొత్తం 16,866 మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో మెప్మా పరిధిలో 1,960 సంఘాలు ఉండగా 19,600 మంది సభ్యులు, సెర్ప్‌ పరిధిలో 14,906 సంఘాలు ఉండగా 14,9060 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.78 కోట్ల పంపిణీ లక్ష్యంగా ఉండగా, రూ.68 కోట్లు అందజేశారు. మరో రూ.10 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అలాగే జిల్లాలో మొ త్తం రూ.18 కోట్లు బకాయిలు ఉండగా, ఇందులో రూ.15 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. మిగితా రూ.3 కోట్లు రెగ్యులర్‌ బకాయిలు ఉన్నా యి. ఇందులో అత్యధికంగా రామాయంపేట మండలంలో రూ.2.50 కోట్లు, చేగుంటలో రూ.1.65 కోట్లు, కౌడిపల్లిలో రూ.1.45 కోట్లు, చిన్నశంకరంపేటలో రూ.1.45 కోట్లు, నర్సాపూర్‌లో రూ.135 కోట్లు పేరుకుపోయాయి. వీటితో పాటు మిగితా మండలాల్లోనూ రూ. లక్షల్లో బకాయిలు ఉన్నట్లు సమాచారం.

ఆర్‌ఆర్‌యాక్ట్‌ అమలు

ఈ నెలాఖరులోగా మొండి బకాయిలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో మెప్మా, సెర్ప్‌ అధికారులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బకాయిలున్న సంఘాలతో సమావేశాలు నిర్వహించి నోటీసులు అందజేస్తున్నారు. వెంటనే బకాయిలు చెల్లించేలా చైతన్య పరుస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఆర్‌ఆర్‌, కో అపరేటివ్‌ యాక్ట్‌ ద్వారా ఆస్తులు జప్తు చేస్తామని చెబుతున్నారు.

మహిళా సంఘాల్లో పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్లే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పంపిణీ చేసిన రుణాలను చెల్లించడంలో కొంతమంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలో రూ.18 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. అధికారులు ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించినా, స్పందన రావడం లేదు. దీంతో రెవెన్యూ రికవరీ, కో ఆపరేటివ్‌ యాక్ట్‌లు అమలు చేయాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది.

– మెదక్‌ కలెక్టరేట్‌

మొండి బకాయిల వసూళ్ల కోసం మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి డబ్బులు కట్టేలా చైతన్య పరుస్తున్నాం. బకాయి ఉన్న మహిళల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి అర్థమయ్యేలా చెబుతున్నాం. ఈనెలాఖరులోగా డబ్బులు చెల్లించాలని వివరిస్తున్నాం.

– గంగారాం, సీ్త్రనిధి ఆర్‌ఎం, మెదక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement