ఐటీఐలో నూతన కోర్సులు | - | Sakshi
Sakshi News home page

ఐటీఐలో నూతన కోర్సులు

Mar 3 2026 9:07 AM | Updated on Mar 3 2026 9:07 AM

ఐటీఐలో నూతన కోర్సులు

మెదక్‌ కలెక్టరేట్‌: హవేళిఘణాపూర్‌ ప్రభుత్వ ఐటీఐలో పలు నూతన కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన కింద ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ మెకానిక్‌, సీఎన్‌సీ టెక్నీషియన్‌ కోర్సుల్లో మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్‌తో పాటు గుర్తింపు పొందిన ప్రముఖ ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల పది, ఇంటర్‌ చదివిన విద్యార్థులు మెదక్‌లోని ప్రభుత్వ ఐటీఐలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement