కదంతొక్కిన జీపీ కార్మికులు | - | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన జీపీ కార్మికులు

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

కదంతొక్కిన జీపీ కార్మికులు

కదంతొక్కిన జీపీ కార్మికులు

మెదక్‌ కలెక్టరేట్‌: పెండింగ్‌ వేతనాల కోసం పంచాయతీ కార్మికులు కదం తొక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో తమకు రావాల్సిన 4 నెలల జీతా లు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ, యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్‌, ఆసీఫ్‌ మాట్లాడుతూ.. వేత నాలు రాక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో తొలగించిన పంచాయతీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారి ని తొలగించకుండా ప్రభుత్వమే సర్క్యులర్‌ జారీ చేయాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీపీఓ యాదయ్యకు అందజేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్‌, యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement